ఆడం గాలింస్కీ: మీ కోసం మీరు మాట్లాడడం ఎలా

TEDxNewYork

ఆడం గాలింస్కీ: మీ కోసం మీరు మాట్లాడడం ఎలా

September 10, 2016


ఒక విషయం గురించి మాట్లాడడం కష్టం, మనం మాట్లాడితీరాలని తెలిసినప్పుడు కూడాకూడా.సాంఘిక మనస్తత్వవేత్త ఆడం గాలింస్కీ మార్గ నిర్దేశం లో మీ గురించి మీరు చాటుకోవడం నేర్చుకోన్డి,క్లిష్టమైన సామాజిక పరిస్థితుల్లో మార్గనిర్దేశం చేయడం ఇంకా మీ స్వీయ శక్తి యొక్క హద్దులను విస్తరించుకోవడం నేర్చుకోన్డి.

మర్యానో సిగ్ మన్: మీరు వాడే పదాలే మీ భవిష్యత్  మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి

TED2016

మర్యానో సిగ్ మన్: మీరు వాడే పదాలే మీ భవిష్యత్ మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి

February 18, 2016


మీరు ఇప్పుడు మాట్లాడే విధానం ఆధారంగా సైకోసిస్ దృష్ట్యా భవిష్యత్ లో మీ మానసికస్థితిని అంచనా వేయగలమా?మంత్రముగ్థులను చేసే ఈ ఉపన్యాసంలో ప్రముఖ న్యూరోసైంటిస్ట్ మరియానో సిగ్మన్ ప్రాచీన గ్రీకుల అంతశ్శోధన మూలాలను ఆధారంగా చేసుకుని మనం వాడే పదాలు మన అంతరాంతరాల ఆలోచనా విధానాన్ని ఎలా బయటపెడ్తాయో చెపుతూ, ఆ పదాల ఎంపిక ద్వారా స్కిజోఫెర్నియా లక్షణాలను గుర్తించే విధానం వివరిస్తూ, ముందు కాలంలో మానసికారోగ్యాన్ని విభిన్న కోణాల్లో చూస్తామని అంటారు.ఇది మనం వాడే పదాల అటోమాటిక్ అనాలిసిస్ ,అంతేకాక లక్ష్యాత్మకమైనది,స్వయంతచాలకమైనది కూడా అని ఈ ఉపన్యాసంలో వివరించారు.

నట్ హానియస్: కంపెనీలు ఫెయిల్ అవడానికి గల రెండు కారణాలు_ వాటి నెలా నివారించగలం

TED@BCG London

నట్ హానియస్: కంపెనీలు ఫెయిల్ అవడానికి గల రెండు కారణాలు_ వాటి నెలా నివారించగలం

June 30, 2015


ఒక కంపెనీని నడుపుతూ ,క్రొత్త మార్పులను చేపట్టడం సాధ్యమేనా?వ్యాపార వ్యూహకర్త నట్ హానియస్ దృష్టిలో ఉన్నత స్థాయిని చేరాక కూడా నూతన మార్గాలను చేరుకునే సామర్థ్యమే సంస్థ ఘనతకు గుర్తు.వారు మనకు తెలిసిన దాంట్లో పర్ఫెక్షన్ ను సాధించడం, నూతన ఆవిష్కరణలను కనుగొనడం ఈ రెంటిలో సమతుల్యతనెలా సాధించాలో తన దైన శైలిలో వివరిస్తున్నారు . అది సమయంలో ఈ రెంటిలో ఒక దానిపై మొగ్గు చూపకుండా ఎలా నడుచుకోవాలో వివరిస్తున్నారు

రేష్మా సౌజాని: బాలికలకు ధైర్యాన్ని నేర్పండి,పరిపూర్ణత్వాన్ని కాదు

TED2016

రేష్మా సౌజాని: బాలికలకు ధైర్యాన్ని నేర్పండి,పరిపూర్ణత్వాన్ని కాదు

February 17, 2016


మనం మన బాలికలను పర్ ఫెక్ట్ గా ,బాలురను ధైర్యవంతులుగా అయ్యేలా పెంచుతున్నాం అంటారు రేష్మా సౌజాని.వీరు 'Girls Who Code' సంస్థను స్థాపించారు. బాలికలకు రిస్క్ తీసుకోవడం , ప్రోగ్రాం చేయడం అనే రెండు నైపుణ్యాలను నేర్పడానికై కంకణం కట్టుకున్నారు.ఈ రెండు నైపుణ్యాలు సంఘం ముందడుగు వెయ్యడంలో ఉపకరిస్తాయి .ఇది నిజంగా సరికొత్తభావన .మన జనాభాలో సగం మందిని వదిలి మనం ముందుకు పోలేము అన్నది వీరి నినాదం. మీలో ప్రతిఒక్కరూ నాకు కావాలి. ప్రతి మహిళా తన లోని లోపాలను అంగీకరిస్తూ, సౌఖ్యంగా జీవిచంగలగాలి అన్నది ప్రచారం చేయడం కోసం.

జుడ్సన్ బ్రువర్: చెడు అలవాట్లను వదిలించుకునే సరళమైన మార్గం

TEDMED 2015

జుడ్సన్ బ్రువర్: చెడు అలవాట్లను వదిలించుకునే సరళమైన మార్గం

November 18, 2015


ఆసక్తి అనే మార్గంలో మనం చెడు అలవాట్లకు దూరం కాగలమా ?సైకియాట్రిస్ట్ జుడ్సన్ బ్రువర్ మనస్ఫూర్తికి వ్యసనానికి మధ్య గల సంబంధాన్ని గురించి అధ్యయనం చేసారు . పొగతాగడం నుంచి , అతిగా తినడం వరకు అంశాలనెన్నింటినో స్పృశించారు.అవి మంచివి కావని మనకు తెలుసు.అలవాట్లు ఎలా స్థిరపడతాయో విశదంగా తెలుసుకోండి.సరళమైన , ప్రభావవంతమైన ఒక తంత్రం మీకు మరోసారి సిగరెట్ ను కాల్చాలనిపించినప్పుడు , ఆకలి తీరాక కూడా తినాలనిపించినప్పుడు, కారు నడుపుతుండగా సెల్ చూడాలనిపించినప్పుడు నిగ్రహించుకునేలా సహాయపడుతుంది.

అచేన్యో ఈదచబ: ఒక కలుపు మొక్కను వృద్ధి చెందే వ్యాపారంగా ఎలా మార్చాను

TEDWomen 2015

అచేన్యో ఈదచబ: ఒక కలుపు మొక్కను వృద్ధి చెందే వ్యాపారంగా ఎలా మార్చాను

May 27, 2015


Water Hyacinth హానిచేయని, ఒక పూల చెట్టుగా కనిపించవచ్చు -- కాని నిజానికి అది ఒక కలుపు మొక్క, నది ప్రవాహాన్ని అడ్డుకొని, రవాణాని తగ్గించి, బడికి వెళ్ళే పిల్లలల్నుంచి జనాల బ్రతుకుతెరువుల్ని అస్తవ్యస్తం చేసే మొక్క.ఈ శాపాన్ని, పర్యావరణ వ్యాపారవేత్త, అచేన్యో ఈదచబ, వ్యాపార అవకాశంగా మలిచారు. కలుపు మొక్కల్ని వ్యాపార అద్బుతంగా ఎలా మలిచారో చూడండి.

ఓమవా షీల్డ్స్: మనం వేరే గ్రహాల మీద జీవరాశుల్ని ఎలా కనుగొంటాం

TED2015

ఓమవా షీల్డ్స్: మనం వేరే గ్రహాల మీద జీవరాశుల్ని ఎలా కనుగొంటాం

March 16, 2015


ఖగోళ శాస్త్రవేత్త ఓమావా షీల్డ్స్ జీవితం సుదూర ఎక్సోప్లానెట్స్ లో వాతావరణాలు పరీక్షించి విశ్వంలో మరెక్కడైనా జీవరాశులు ఉండ్వచ్చేమో అన్న విషయములో ఆధారాల కోసం శోధిస్తున్నారు. ఆమె స్వర్గాలను అన్వేషించ నప్పుడు, శాస్త్రీయ శిక్షణ పొందిన నటి (మరియు టెడ్ ఫెలో) అయినందున, థియేటర్, రచన మరియు దృశ్య కళ ఉపయోగించి శాస్త్రాలలో యువతులను ఎలా నిమగ్నం చేయాలా అని మార్గాలు వెదుకుతారు. “బహుశా ఒక రోజు వారు పూర్తిగా వైరుధ్యాలు కలిగిన ఖగోళ శాస్త్రవేత్తలుగా మార్తారని మరియు వారి నేపథ్యాన్ని ఉపయోగించుకొని, మనము నిజంగా విశ్వంలో ఒంటరిగా లేమని, అందరికీ వారి అన్వేషణలతో తెలియచేస్తారు" అని ఆమె చెప్పారు.

రాబర్ట్ వాల్డింగర్: మంచి జీవితం అంటే ఏంటి? ఆనందం గురించి అత్యంత పొడవైన అధ్యయనం నుండి పాఠాలు

TEDxBeaconStreet

రాబర్ట్ వాల్డింగర్: మంచి జీవితం అంటే ఏంటి? ఆనందం గురించి అత్యంత పొడవైన అధ్యయనం నుండి పాఠాలు

November 14, 2015


మన జీవితంలో చూస్తే దేని వలన మనము సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటాము? మీరు కీర్తి మరియు ధనము అని భావిస్తే, అలా అనుకొనే వాళ్ళలో మీరు ఒక్కరే కాదు- మానసిక వైద్యుడు రాబర్ట్ వల్డింగర్ ప్రకారం, మీరు అనుకొనేది తప్పు. 75 ఏళ్ల పైన బడిన వయోజన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయన దర్శకుడిగా, వాల్డింగర్ కు నిజమైన ఆనందం మరియు సంతృప్తి గురించి ముందెన్నడూ లేనంత డేటా ఉంది. ఆయన తమ అధ్యయనం, కొంత అనుభవం మరియు పాత కొండల నాటి జ్ఞానం వలన తెలుసుకున్న మూడు రకాలైన పాఠాలను, ఒక సంతృప్తి కరమైన దీర్ఘ జీవితాన్ని ఎలా నిర్మించాలో, ఈ చర్చలో పాలు పంచుకుంటారు.

అలిసన్ కిల్లింగ్: ఒక నగరంలో మృతులకోసం స్థలం కరువైతే ఏమవుతుంది?

TEDxGroningen

అలిసన్ కిల్లింగ్: ఒక నగరంలో మృతులకోసం స్థలం కరువైతే ఏమవుతుంది?

November 20, 2014


UK లో మీరు బయటికి వెళ్ళి, ఒక స్వంత సిమెట్రీని ఏర్పాటు చేసుకోవాలంటే ,అది సాధ్యమే అంటారు అలిసన్ కిల్లింగ్. ప్రజలు చనిపోయే ప్రదేశం గురించీ, ఖనన ప్రదేశం గురించీ చాలా ఆలోచిస్తున్నారు ఆమె.ఆర్కిటెక్ట్ , TED అనుయాయి అయి ఆమె ఈ ప్రసంగంలో మన నగరాలు, పట్టణాల్లో ఉపేక్షిస్తున్న ఒక అంశాన్ని సామాజిక , ఆర్థిక దృక్కోణంలో ఆలోచించేలా విశదీకరిస్తున్నారు.అదే సిమెట్రీ.మీరెక్కడఖననమవొచ్చు అనే విషయాన్ని హాస్యభరితంగా , ఆకర్షణీయంగా వైరుధ్య పూరితమైన u.kచట్టాల ఆధారంగా ప్రసంగించారు.

రేమాండ్  వాంగ్: విమానంలో క్రిముల ప్రయాణం--ఎలా నివారించగలం

TEDYouth 2015

రేమాండ్ వాంగ్: విమానంలో క్రిముల ప్రయాణం--ఎలా నివారించగలం

November 14, 2015


రేమాండ్ వాంగ్ వయస్సు కేవలం 17 సంవత్సరాలే.కానీ ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో తోడ్పడుతున్నాడు.ఫ్లూయిడ్ డైనమిక్స్ ను ఉపయోగించి విమానాల్లో గాలి ఎలా ప్రయాణిస్తుంది అన్న విషయంపై కృత్రిమ వాతావరణం సృష్టించాడు.అతడు కనుగొన్నది మనలను ఆందోళనలకు గురి చేసేదిగా వుంది. విమానంలో ఒక వ్యక్తి తుమ్మితే గాలి ఆ సూక్ష్మ క్రిములను ఇతర ప్రయాణీకులకు సోకేలా చేస్తున్నది.అనిమేషన్ ద్వారా విమానంలో తుమ్ము ప్రయాణ వివరాలను మనతో పంచుకున్నాడు.దానికై అతడు బహుమతి పొందిన పరిష్కారాన్ని పరిచయం చేసాడు.ఇది ఒక చిన్న రెక్క ఆకార సాధనం.ఇది తాజా గాలిని విమానంలో పెంచుతూ, సూక్ష్మ క్రిములతో నిండిన గాలిని బయటికి వెళ్ళేలా చేస్తుంది.

దానిట్ పెలేగ్: ఇక షాపింగ్ మర్చిపోండి. త్వరలో మీరు బట్టల్ని డౌన్లోడ్ చేస్కోవచ్చు.

TEDYouth 2015

దానిట్ పెలేగ్: ఇక షాపింగ్ మర్చిపోండి. త్వరలో మీరు బట్టల్ని డౌన్లోడ్ చేస్కోవచ్చు.

November 14, 2015


మీ గదిలోంచే మీకు నచ్చినట్టుగా బట్టల్ని ముద్రించుకొనే సాంకేతిక పరిజ్ఞానం త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఫాషన్ స్కూల్ ప్రాజెక్ట్ లా మొదలైన దానిట్ పెలేగ్ యొక్క పని, 3D పరిజ్ఞానంతో - మన్నిక మరియు పట్టుత్వం కలిగిన దినసరి దుస్తుల సంగ్రహారంగా రూపుదిద్దుకుంది. "ఫాషన్ శారిరికమైనది. మనం ధరించే దుస్తులు డిజిటల్ సంకేతికతో ఉత్పత్తి అయినప్పుడు ప్రపంచం ఎలా మారుతుందో వేచి చూడాలి" అని వక్త ప్రసంగంలో అభిప్రాయ పడుతున్నారు

చీకో అసకావా: అంధులు బయటి ప్రపంచాన్ని చూడడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా సహాయపడుతుంది

TED@IBM

చీకో అసకావా: అంధులు బయటి ప్రపంచాన్ని చూడడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా సహాయపడుతుంది

October 15, 2015


ఎలా సాంకేతికత మన జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎలా సహాయము చేయగలదు? మనము చూసే జ్ఞానము ఉపయోగించకుండా ఈ ప్రపంచంలో ఎలా ప్రయాణం చేయగలం? తనకు పధ్నాలుగు ఏళ్ళు వయసు వచ్చినప్పటి నుండీ అంధుడిగా ఉన్న ఆవిష్కర్త మరియు ఐబియం ఫెలో అయిన చీకో అసకావా, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించింది. ఈ అందమైన ప్రదర్శనలో, ఆమె సరి కొత్త సాంకేతికత అంధులను ఈ ప్రపంచాన్ని స్వతంత్రంగా పరిశోధించుటానికి సహాయము చేస్తుంది ఎందుకంటే, మనము ఎక్కువ ప్రాప్యత కోసం ఆలోచించి రూపొందించినప్పుడు, అందరికీ ప్రయోజనాలు అందుతాయి.

ఆన్ మోర్గాన్: నా సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి ఒక పుస్తకాన్ని చదవడం

TEDGlobal>London

ఆన్ మోర్గాన్: నా సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి ఒక పుస్తకాన్ని చదవడం

September 29, 2015


ఆన్ మోర్గాన్ తన పుస్త్లకాల అరలో "స్థూలమైన సాంస్కృతిక అంధ బిందువు" కనుగొనే వరకు తాను బాగా చదువుతానని భావించేవారు. ఇంగ్లీష్ మరియు అమెరికన్ రచయితల సమూహము నడుమ, ఆంగ్లం మాట్లాడే ప్రపంచం దాటి చాలా కొన్ని రచయితల రచనలు ఆమె వద్ద ఉన్నాయి. కాబట్టి ఆమె ఒక సంవత్సరంలో ప్రపంచంలో ప్రతి దేశం నుండి ఒక పుస్తకం చదవాలని ఒక ఔత్సాహిక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె ఆంగ్ల భాష ఇష్ట బడే వాళ్ళను అనువాద రచనలను చదవమని విజ్ఞప్తి చేస్తోంది ఎందుకంటీ ఇలా చేస్తే ప్రచురణకర్తలు బాగా కష్టబడి విదేశీ సాహిత్య రత్నాలు తీసుకుని వారి తీరాలకు తిరిగి తీసుకు వస్తారని. ఇక్కడ: go.ted.com/readtheworld ఆమె పఠన ప్రయాణం ఇంటరాక్టివ్ పటాలు అన్వేషించండి .

జీన్-పాల్ మేరీ: చావుతో పోరాటం తరువాత చల్లటి ప్రకంపనం

TEDxCannes

జీన్-పాల్ మేరీ: చావుతో పోరాటం తరువాత చల్లటి ప్రకంపనం

March 28, 2015


ఏప్రిల్ 2003 లో, అమెరికన్ దళాలు బాగ్దాద్ చుట్టుకోవటం ప్రారంభించగానే, ఒక షెల్ జీన్-పాల్ మారి అనే రచయిత మరియు యుద్ధం కరస్పాండెంట్ రిపోర్టింగ్ చేస్తున్న భవనాన్ని గుద్దుకుంది. అక్కడ అతను పురాతన కాలం నుంచి జీవితాలను పణంగా పెట్టి యుద్ధంలో పాల్గొన్న వారితో తన పరిచయాన్ని ప్రారంభించి, చావుతో ముఖా ముఖి పోరాటం చేయవలసి వచ్చింది. మేరీ అదుగుతాడు “ఏ మచ్చలు కనిపించకుండా మిమ్మల్ని ఏ విషయం చంపుతుంది? అది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని మనకు తెలుసు – లేక మేరీ మరణ శూన్యమైన ఒక అనుభవం గురించి వివరిస్తున్నారు. ఈ శోధించే చర్చలో, అతను మృత్యువు మరియు సైకోసిస్ మరియు భయానక మరియు గాయం పరిణామాల గురించి ప్రశ్నలకు సమాధానాలను శోధిస్తుంది.

హెరాల్డ్ హాస్: ఒక కొత్త సంచలనాత్మక వైర్లెస్ అంతర్జాలము

TEDGlobal>London

హెరాల్డ్ హాస్: ఒక కొత్త సంచలనాత్మక వైర్లెస్ అంతర్జాలము

September 29, 2015


మనం ఇప్పటికే ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న 4 బిలియన్ కంటే ఎక్కువ ప్రజలకు అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఆఫ్-ది-షెల్ఫ్ LEDలు మరియు సౌర ఘటాలు ఉపయోగించుకొని హెరాల్డ్ హాస్ మరియు అతని జట్టు కాంతిని ఉపయోగించి డేటాను ప్రసారం చేయడానికి ఒక కొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని కనుగొన్నారు మరియు ఇది డిజిటల్ డివైడ్ తగ్గించడానికి మూలము అవవచ్చు. భవిష్యత్తులో అంతర్జాలము ఎలా ఉండవచ్చో ఒక సారి చూడండి.

కాకి కింగ్: కాంతి మరియు రంగుల ప్రపంచంలోనికి ఒక సంగీత ప్రయాణం

TEDWomen 2015

కాకి కింగ్: కాంతి మరియు రంగుల ప్రపంచంలోనికి ఒక సంగీత ప్రయాణం

May 27, 2015


కాకి కింగ్ తన శైలితో మున్ముందు ఒక గిటార్ దేవుడు కావచ్చు. ఆమె చేతులతో పనిచేసే పురాతన సంప్రదాయాన్ని డిజిటల్ టెక్నాలజీ తో కలిపి, తన మల్టీమీడియా రచనతో ఆమె గిటార్ పై ప్రొజెక్షన్-మ్యాపింగ్ ఊహాచిత్రాలతో “మెడ శరీరానికి ఒక వంతెన” అనే ఆలోచన కలిగిస్తుంది. ఆమె గిటార్ యొక్క మెడను ఒక కీబోర్డు లాగా ఉపయోగించి, తన క్లిష్టమైన శ్రావ్యతతో, ఆమె కాంతి మరియు ధ్వనితో కూడిన ఒక సంగీత ప్రయాణంలో ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఆమె “గిటార్ ఒక పైంట్ బ్రష్” అని పిలుస్తుంది.

శామ్యూల్ కోహెన్: అల్జీమర్స్ సాధారణ ముసలితనము కాదు - మరియు మనం దానిని నయం చేయవచ్చు

TED@BCG London

శామ్యూల్ కోహెన్: అల్జీమర్స్ సాధారణ ముసలితనము కాదు - మరియు మనం దానిని నయం చేయవచ్చు

June 30, 2015


ప్రపంచంలో 40 మిలియన్లకు పైగా ప్రజలు అల్జీమర్స్ వ్యాధితో (మతిమరపు వ్యాధి) బాధ పడుతున్నారు, మరియు ఆ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితం ఈ వ్యాధిని వర్గీకరణ చేసినప్పటికినీ, ఈ వ్యాధి చికిత్సలో మనము చెప్పుకొదగ్గ పురోగతి సాధించలేదు. శామ్యూల్ కోహెన్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగశాల నుండి, అల్జీమర్స్ పరిశోధనలో నూతన పురోగతి మరియు ఆశా సందేశాన్ని పంచుకున్నారు. ఆయన అంటున్నారు “ఆల్జీమెర్స్ ఒక వ్యాధి మరియి దాన్ని మనం నయం చేయగలం”.

పేషన్స్ మ్తున్జి: HIVను లేజర్స్ తో నయం చేయగలమా?

TED2015

పేషన్స్ మ్తున్జి: HIVను లేజర్స్ తో నయం చేయగలమా?

March 18, 2015


మాత్రలు వ్యాధిని నయం చేయడానికి వేసుకోవడం, వేగవంతమైన మరియు నొప్పిలేని ప్రక్రియ. కాని అది అత్యంత ప్రభావవంతం కాదు. మరి ఇంకా ఏదైనా సమర్ధవంతమైన, పద్ధతి ఉందా? లేజర్స్ (LASERs). ఈ ఉపన్యాసంలో TED సంస్థలో తోటి మెంబెర్ అయిన, పేషన్స్ మ్తున్జిగారు తమ ఆలోచనను వివరిస్తూ, లేజర్స్ ఉపయోగించి మందును HIV వ్యాధిగ్రస్త ప్రాంతాల్లో ఎలా ప్రవేశ పెట్టచ్చో చెప్తున్నారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా, సమస్యకు సమాధానం దగ్గరలోనే ఉందా?

మెమరీ బండ: బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఒక యోధురాలి బాథ!

TEDWomen 2015

మెమరీ బండ: బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఒక యోధురాలి బాథ!

May 29, 2015


మెమరీ బండగారి జీవితం వారి చెల్లెలి జీవితం కన్నా భిన్నంగా సాగింది. వారి చెల్లె యుక్తవయస్కురాలు కాగానే, సంప్రదాయక ఇనీసియేషన్ కాంపులకు పంపబడింది. ఆ క్యాంపులలో, బాలికలకు పురుషులను ఎలా సంతృప్తి పరచాలో నేర్పుతారు. వారి చెల్లి 11 ఏళ్ళ ప్రాయంలోనే గర్భవతి అయ్యింది. మరోపక్క వక్త బండ, అలాంటి క్యాంపుకు వెళ్ళుటకు నిరాకరించారు. తన తోటివారిని సంఘటితం చేసి, తమ సంఘం నాయకుడ్ని 18 ఏళ్ళలోపు జరిగే బలవంతపు వివాహాల్ని అరికట్టే వివాహ చట్ట మార్పు చేయమని కోరారు. అలా సంఘంతో మొదలైన ఆమె ప్రయాణం మలావి దేశపు చట్టాన్నే మార్చి, బాలికల జీవితాల్లో వెలుగులు నింపింది

కాస్మిన్ మిలావ్: విసుగెత్తించే ఫిజికల్ థెరపీ అభ్యాసాలను మానండి--సరదాగా ఆటలు ఆడండి

TED2015

కాస్మిన్ మిలావ్: విసుగెత్తించే ఫిజికల్ థెరపీ అభ్యాసాలను మానండి--సరదాగా ఆటలు ఆడండి

March 10, 2015


అప్పుడప్పుడే గాయపడి వున్న మీరు ఫిజికల్ థెరపీ అభ్యాసాలను చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. గుణం కన్పించడానికి చాలా కాలం తీసుకోవడమే కాక విసుగును పుట్టించే ఈ అభ్యాసాలను చేయడానికి చివరి అంశంగా భావిస్తున్నారు TEDఅనుయాయి అయిన కాస్మిన్ మిలావ్ ఒక సరదాఅయిన, చవకైన పరిష్కారాన్ని దీనికై సూచిస్తున్నారు విసుగు పుట్టించే,ఈ అభ్యాసాలను స్పష్టమైన సూచనలతో వీడియో గేం లా మార్చి మనకు అందిస్తున్నారు.

తేనెటీగల జీవితంలో మొదటి మూడువారాలు  ఓ అద్భుత దృశ్యం: A thrilling look at the first 21 days of a bee’s life

TED2015

తేనెటీగల జీవితంలో మొదటి మూడువారాలు ఓ అద్భుత దృశ్యం: A thrilling look at the first 21 days of a bee’s life

March 18, 2015


తేనెటీగలు అదృశ్యమౌతున్నాయని మనం వింటున్నాం. కానీ ఈ ఇవి మాయమవడానికి గల కారణం ఏమిటి?ఫోటోగ్రాఫర్ ఆనందవర్మ వీటిని తన పెరట్లో పెంచారు.స్పష్టంగా చూడాలని ఒక కెమెరాను అమర్చారు.నేషనల్ జగ్రాఫిక్ వారి కోసం చేసిన ఈ ప్రాజెక్ట్ తేనెపట్లను గూర్చి సంక్షిప్త వివరణ నిస్తుంది.వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక కారణాన్ని బయటపెడుతుంది.చిన్న తేనెటీగలజీవితంలో మొదటి మూడు వారాల్లో ప్రభావం చూపేపురుగుల కథ ఇది.అతి విలువైన ఈ ఫిల్మ్ కు Magik Orchestra వారి సహకారంతో సంగీతం సమకూర్చారు. వర్మ సమస్యను చూపడమేగాక పరిష్కారమార్గాన్ని కూడా సూచిస్తున్నారు

కైలాశ్ సత్యార్థిగారు: కోపం ద్వారా శాంతిని ఎలా తేగలం?

TED2015

కైలాశ్ సత్యార్థిగారు: కోపం ద్వారా శాంతిని ఎలా తేగలం?

March 25, 2015


ఉన్నత కులంలో పుట్టిన ఒక యువకుడు భారత దేశంలోని 83,000 మంది పిల్లలను ఎలా దాస్యవిముక్తి చేయగలిగాడు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిగారు ఒక ఆశ్చర్యకరమైన సలహానిస్తున్నారు ఈ ప్రపంచాన్ని మరింత బాగా మార్చాలనుకునే వారి కోసం. అన్యాయం పట్ల కోపం తెచ్చుకోండి అని. ఈ ప్రభావవంతమైన ఉపన్యాసంలో కోపంలోంచి పుట్టిన శాంతిసాధన జీవితాశయంగా ఎలా మారిందీ వివరిస్తున్నారు.

కారోల్ డ్వేక్: మెరుగు పరుచుకొనవచ్చు అనే నమ్మకం యొక్క శక్తి

TEDxNorrkoping

కారోల్ డ్వేక్: మెరుగు పరుచుకొనవచ్చు అనే నమ్మకం యొక్క శక్తి

November 11, 2014


కారోల్ డ్వేక్ గారు, గ్రోత్ మైండ్ సెట్ మీద తమ పరిశోధనా సారాంశాలు విన్నవిస్తూ - ఈ విధానంలో సమస్యలనుంచి మనం నేర్చుకొని మన తెలివితేటలు పెంచుకోనవచ్చు అంటున్నారు. ఈవిడ ప్రతి క్లిష్ట సమస్యను రెండు కోణాలలో చూడడం నేర్చుకోమ్మంటున్నారు. ఒకటి - దీనిని ఎదుర్కొనేందుకు నా తెలివితేటలు సరిపోతాయా? లేదా దీన్నినేనింకా పరిష్కరించడానికి పూనుకోలేదా? అని. ప్రభావవంతమైన రంగానికి ఒక గొప్ప పరిచయం.

ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్: సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వ్యాపారాలు ఎందుకు గొప్ప సమాధానాలు కాగలవు

TEDGlobal 2013

ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్: సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వ్యాపారాలు ఎందుకు గొప్ప సమాధానాలు కాగలవు

June 14, 2013


ఎందుకు మనము లాభరహిత సంస్థలు మరియు ప్రభుత్వాలు, సమాజం యొక్క అతిపెద్ద సమస్యలను పరిష్కరిస్తాయని అనుకుంటాము? ప్రొఫెసర్ మైకేల్ పోర్టర్ తను వ్యాపార పక్షపాతిని అని ఒప్పుకుంటూనే, వ్యాపారాలు మనకున్న అతిపెద్ద సమస్యలను తీర్చగలవో తమ వాదనను వినిపిస్తున్నారు. వారి ప్రకారం, వ్యాపారాలు ఒక అవసరానికి లేదా సమస్యకు సమాధానం చూపినప్పుడు, వచ్చే ఆ లాభాల్ని, సామాజిక సమస్యలను తీర్చడంకోసం వినియోగించవచ్చు.

ఏంజెలా లీ డక్వర్త్: విజయానికి కీలకమైనది? పట్టుదల

TED Talks Education

ఏంజెలా లీ డక్వర్త్: విజయానికి కీలకమైనది? పట్టుదల

April 4, 2013


కన్సల్టేన్సి ఉద్యోగాన్ని వదలి, ఏంజెలా లీ డక్వర్త్, ఏడవతరగతి గణితం బోధించడానికి న్యూ యార్క్ పుబ్లిక్ స్కూలుకు వెళ్ళింది. విజయవంతమైన పిల్లలకు ఇబ్బందిపడే పిల్లలకు మధ్య తేడా వారి IQ లో మాత్రమేకాదు అని త్వరలోనే గ్రహించింది. ఇక్కడ ఆమె విజయానికిఅకి కారణం ఎదగాలనే పట్టుదల అని వివరిస్తుంది.

రాబ్ రీడ్:  ఎనిమిది వందల కోట్ల డాలర్ల విలువ చేసే ఐపాడ్

TED2012

రాబ్ రీడ్: ఎనిమిది వందల కోట్ల డాలర్ల విలువ చేసే ఐపాడ్

March 1, 2012


ప్రముఖ హాస్య రచయిత రాబ్ రీడ్ వినోద పరిశ్రమలోని న్యావాదుల నుండి సేకరించబడిన సమాచారం ఆదరంగా తను చేసిన అధ్యయనంను ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు.

ఒక TED ఉపన్యాసకుడి పీడకల

TED2012

ఒక TED ఉపన్యాసకుడి పీడకల

March 1, 2012


కోలిన్ రాబర్ట్సన్ కు తన సౌర-శక్తితో పనిచేసే క్రౌడ్ సోర్సింగ్ ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ పరిష్కారం గురించి ప్రపంచ చెప్పడానికి వేదికపై ౩ నిమిషాలు ఇవ్వబడ్డాయి. ఆపై ...

Matt Cutts: 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించండి

TED2011

Matt Cutts: 30 రోజులలో కొత్త వాటి కోసం ప్రయత్నించండి

March 3, 2011


మీ దెగ్గర ఏదైనా ఉద్ధేసించడానికి లేదా ఏదైనా చేసేదానికి ఉండికూడా,చెయ్యలేకపోతున్నారా?? మార్క్ కట్ట్స్ దీనిని సూచిస్తున్నారు: మీ పనిని 30 రోజులలో ప్రయత్నించండి.ఈ చిన్న ఉపన్యాసం మీ లక్ష్యం సాధించడానికి మరియు మీ లక్ష్యాన్ని ఎంచుకునేదానికి ఉపయోగపడుతుంది.

సెక్స్ బానిసత్వం ఫై సునీత కృష్ణన్ పోరాటం

TEDIndia 2009

సెక్స్ బానిసత్వం ఫై సునీత కృష్ణన్ పోరాటం

November 5, 2009


సునీత కృష్ణన్ తన జీవితాన్ని స్త్రీలను , చిన్నారులను సెక్స్ బానిసత్వం (కోటను కోట్ల అంతర్జాతీయ వ్యాపారం ) నుంచి విముక్తి కలిగించటానికి అంకితం చేశారు. ఈ నిర్భయ సంభాషణలో, తన జీవితం తో కలిపి మూడు వేరువేరు కధలలో, ప్రతి ఒక్కరూ మానవీయ దృక్పదం తో విధి కాటేసిన పసి జీవితాలలో కొత్త జీవం నింపాలని పిలుపు నిచ్చారు.

అహాన్ని  పారద్రోలు , కరుణను  అన్వేషించు

TEDSalon 2009 Compassion

అహాన్ని పారద్రోలు , కరుణను అన్వేషించు

October 1, 2009


Imam Faisal Abdul Rauf combines the teachings of the Qur’an, the stories of Rumi, and the examples of Muhammad and Jesus, to demonstrate that only one obstacle stands between each of us and absolute compassion -- ourselves.