TED Talks with Telugu transcript

ఫెయిత్ ఓసీర్: మేలైన మలేరియా వాక్సిన్ తయారీ  కి దారి

TED2018

ఫెయిత్ ఓసీర్: మేలైన మలేరియా వాక్సిన్ తయారీ కి దారి
1,593,424 views

మలేరియా వాక్సిన్ ఒక శతాబ్దం క్రితం కనుగొన్నారు-- ఐనా ప్రతి సంవత్సరం అనేక మంది మనుష్యులు ఈ వ్యాధి వల్ల చనిపోతున్నారు. మనము ఈ ప్రాణాధారమైన వాక్సిన్ ని ఎలా మెరుగుపరచగలం? ఈ వివరణాత్మక భాషణ లో ఇమ్మ్యూనోలోజిస్ట్ ,టెడ్ ఫెలో ఫిత్ ఓసీర్ తాను ఎలా సరికొత్త సాంకేతికను, శతాబ్దం నాటి జ్ఞానాన్ని ఓ కొత్త వాక్సిన్ రూపకల్పనలో రంగరించి, మలేరియా అనేదే లేకుండా చేయాలనే ప్రయాతాన్ని వివరిస్తున్నారు

అశ్విని అన్బురాజన్: క్రిప్టోకరెన్సీలు స్టార్ట్ అప్ లలో పెట్టుబడులకు ఎలా సహకరించగలవు.

TED Residency

అశ్విని అన్బురాజన్: క్రిప్టోకరెన్సీలు స్టార్ట్ అప్ లలో పెట్టుబడులకు ఎలా సహకరించగలవు.
1,760,547 views

అశ్విని అన్బురాజన్ అంటారు "ఆవిష్కరణల్లో మనం ఒక సువర్ణ శకం లో ఉన్నాం." కానీ వెంచర్ కాపిటల్ (పెట్టుబడి / మూలధన) ఇంకా పరిణితి చెందలేదు, స్టార్టుప్ లు ఎదగటానికి ఎలాంటి పెట్టుబడి పొందటంలేదు. ఈ చర్చ లో ఆవిడ, తన సంస్థ లో పెట్టుబడి పెట్టటానికి ,పరస్పర సహకారం మరియు క్రిప్టో కరెన్సీ లను వాడి మూలధన సముపార్జనకు ఎలా ఒక కొత్త దారిని కనుగొన్నారో , ఆ ఆలోచనని పంచుకుంటారు.

ట్రేసీ కీసీ: పోలీసులు, ప్రజలు కలిసి సరక్షిత వాడలను సృష్టించగలరు

TED Salon Brightline Initiative

ట్రేసీ కీసీ: పోలీసులు, ప్రజలు కలిసి సరక్షిత వాడలను సృష్టించగలరు
1,353,413 views

మనందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటాం, మన శాంతిభద్రతలు పెన వేసుకొని ఉన్నాయి . ఈమె పోలీసింగ్ ఈక్విటీ సెంటర్ కు కో ఫౌండర్. పోలీస్ ఆఫీసర్ గా తన 25 సంవత్సరాల అనుభవంలో గడించిన పాఠాలను పంచుకుంటూ,కీసీ ప్రజారక్షణలో ఎదురయ్యే సమస్యలను పోలీసులు , ప్రాంతీయనేబర్ హుడ్ లు ఎదుర్కొనే సమస్యలను ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ సంఘాలలో జరిగే వాటిని గమనించాలి.అలాగే మనందరం పరిరక్షించుకోవాల్సిన గౌరవాన్ని, కఛ్చితమైన న్న్యాయాన్ని, పొందడానికి కలిసి ముందుకు సాగాలి. మనలో వ్యతిరేక అభిప్రాయాలుండరాదని అంటారు కేసీ.

డిఆండ్రియా సాల్వడార్: అల్పాదాయ వర్గాలకువిద్యుత్ ను మరింతగా అందుబాటులోకి ఎలా తేగలం

TED2018

డిఆండ్రియా సాల్వడార్: అల్పాదాయ వర్గాలకువిద్యుత్ ను మరింతగా అందుబాటులోకి ఎలా తేగలం
1,539,290 views

ప్రతినెలా లక్షలాది అమెరికన్లు ఇంటి విద్యుత్ బిల్లులను చెల్లించడానికీ, కనీసావసరాలైన ఆహారం ,వైద్యం లను తీర్చుకావడానికి చాలా కష్టాలు పడుతున్నారు.TED సభ్యురాలైన డిఆండ్రియాసాల్వడార్ విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గించడానికై కృషి చేస్తున్నారు.ఈ చిరు ప్రసంగంలో ఆమె తన ప్రసంగంలో అల్పాదాయ వర్గాల కు విద్యుత్ బిల్లులు తగ్గించడానికి తన ప్రణాళికను మనతో పంచుకున్నారు.ఇవి మరింత విశ్వసనీయమైనవి,అందుబాటులో వున్నవి.

టామీ మెకాల్: చిన్నగ్రాఫిక్  లో దాగిన అద్భుతనైపుణ్యం

TED2018

టామీ మెకాల్: చిన్నగ్రాఫిక్ లో దాగిన అద్భుతనైపుణ్యం
827,342 views

గ్రాఫిక్ చరిత్ర కొంతా ,దానిపై ప్రేమ కొంతా నిండిన ఈ పాఠంలో సమాచార రూపశిల్పి టామీ మెకాల్ చార్టుల,డయాగ్రంల శతాబ్దాల పరిణామంలో క్లిష్టమైన సమాచారానికి అందమైన ఆకృతినెలా ఇవ్వొచ్చో వివరించి చూపారు. గ్రాఫికులు మన ఆలోచనా వేగాన్ని పెంచుతాయన్నారు. ఒక పెద్ద పుస్తకంలో దాగిన సమాచారాన్ని ఓ సింగిల్ పేజీకి కుదించగలవు. ఇవి నూతన ఆవిష్కరణలకు ప్రవేశద్వారం అంటారు మెకాల్.

కైట్లిన్ సాడ్ట్లెర్: మన శరీరాలకి  త్వరగా నయం చేసుకునేటట్టు ఎలా నేర్పించవచ్చు

TED2018

కైట్లిన్ సాడ్ట్లెర్: మన శరీరాలకి త్వరగా నయం చేసుకునేటట్టు ఎలా నేర్పించవచ్చు
2,315,538 views

ఎక్స్ -మెన్ లో వుల్వరైన్ లాగా మనము మన శరీరాలని మచ్చలు లేకుండా నయం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? టెడ్ సహచరురాలు కైట్లిన్ సాడ్ట్లెర్ మన రోగనిరోధక వ్యవస్థ గాయాలకు ప్రతిస్పందించే విధానాన్ని మార్చే కొత్త జీవ పదార్థాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ కలను నిజం చేయటానికి పని చేస్తున్నారు. ఈ చిన్న చర్చ లో , ఆవిడ ఈ ఉత్పతులు వివిధ మార్గాల్లో ఎలా శరీర పునరుత్పత్తికి సహకరిస్తాయో చెబుతారు.

చేతనా గాలా సిన్హా: గ్రామీణ భారతదేశంలో స్త్రీలు ధైర్యాన్ని మూలధవంగా ఎలా మార్చుకున్నారు

TED2018

చేతనా గాలా సిన్హా: గ్రామీణ భారతదేశంలో స్త్రీలు ధైర్యాన్ని మూలధవంగా ఎలా మార్చుకున్నారు
1,542,110 views

బ్యాంకర్లు తన ఇరుగుపొరుగు స్త్రీలకు సేవలను అందించడానికి నిరాకరిస్తే, చేతనా గాలా సిన్హా మరో మంచి పని చేసింది. స్వంతంగా ఓ బ్యాంక్ నే తెరిచింది. అదే దేశంలో స్త్రీల కొరకు స్త్రీలే ప్రారంభించిన బ్యాంక్.ఈ ఉత్తేజకరమైన ప్రసంగంలో ఆమెను ప్రోత్సాహపరిచిన స్త్రీల కథలను పంచుకున్నది. వారామెను సంప్రదాయబ్యాంక్ లు నిరాకరించిన సమస్యలకు సరైన పరిష్కారాలను కనుక్కునేలా ప్రోత్సహించారు.

హెలెన్ జిల్లెట్: "మీరు నన్ను కనుక్కున్నారు"

TEDWomen 2017

హెలెన్ జిల్లెట్: "మీరు నన్ను కనుక్కున్నారు"
445,948 views

సెలిస్ట్ మరియు గాయకురాలు హెలెన్ జిల్లెట్ ఆమె శాస్త్రీయ శిక్షణను మిళితం చేస్తున్నారు ,న్యూ ఓర్లీన్స్-ఆధారిత జాజ్ మూలాలు మరియు స్వేచ్ఛా మెరుగుపరిచిన నైపుణ్యాలను ఆమె స్వంత పరిశీలనాత్మక సంగీతాన్ని ప్రదర్శిస్తుంది.ఒక శక్తివంతమైన, శ్రావ్యమైన ప్రదర్శనలో, ఆమె "మీరు నన్ను కనుక్కున్నారు" పాటను ఆలపిస్తున్నారు

కాటెలెగో కోలాయనే కెసుపైల్: నేను నా గ్రామానికి ప్రత్యేక ప్రతిష్ఠలను ఎలా తెస్తున్నాను

TEDGlobal 2017

కాటెలెగో కోలాయనే కెసుపైల్: నేను నా గ్రామానికి ప్రత్యేక ప్రతిష్ఠలను ఎలా తెస్తున్నాను
1,226,337 views

టెడ్ సభ్యురాలు కాటెలెగో కోలాయనె కెసుపైల్ కవితాధోరణిలో మాట్లాడుతూ వివరిస్తున్నారు.ఆమె ఆధునిక విచిత్ర జీవిత విధానానికీ గ్రామంలో ఆమె పెరిగిన బోట్సువానా జీవితానికిగల సంబంధాన్ని ప్రస్తావిస్తున్నారు.ఒకప్పుడు గోధుమరంగులో ఉండడం ,విచిత్రంగా వుండడం,ఆఫ్రికావాసి అయి వుండడం సబబే అనిపించేది.కేవలం గ్రామీణ నేపథ్యం తప్ప. నా భయమేంటంటే మనం మన పోరాటగాథలను తుడిచిపెట్టేస్తున్నాం.వాటి కారణంగానే నేడు మనమీ స్థానంలో వున్నాం.నా స్థానికతను దేశీయం చేయడమంటే నాలోని చాలా భాగాలను ఏకీకృతం చేయడమే.

టొబాకో బ్రౌన్: జీవితం గురించి తోటపని నాకేం నేర్పింది

TED Residency

టొబాకో బ్రౌన్: జీవితం గురించి తోటపని నాకేం నేర్పింది
1,289,610 views

తోటలు మన జీవితాలకు అద్దాల వంటివి , అంటారు ప్రముఖ పర్యావరణ కళాకారిణి టొబాకో బ్రౌన్ .శ్రధ్ధగా పెంచినప్పుడే వాటి అందాలను పూర్తిగా ఆస్వాదించగలం.ప్రపంచంలోని ప్రముఖ నగరాలలో సహజ ప్రజా కళారూపాలను తన అనుభవాల మూలంగా వెలికిదీయగలిగానని అంటారు.తోటపని మనకు సంవేదన,సంబంధాల విలువను,దయను బోధిస్తుందని అంటారు.

యాసిన్ కాకండే: వలసదారుల గురించి జరిగే చర్చల్లో లోపాలు

TED2018

యాసిన్ కాకండే: వలసదారుల గురించి జరిగే చర్చల్లో లోపాలు
1,098,895 views

శరణార్థులకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో మనం ప్రతి ఒక్కరినోటా వింటున్నాంసరిహద్దుప్రాంతాల్లోని ప్రజలు వారి ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారని రాజకీయనాయకులుఖచ్చితంగా చెప్తున్నారు ఇలా వలసదారులు తప్ప అందరూ మాట్లాడుతుంటారు.అసలు వాళ్ళెందుకు వస్తున్నారు ?ఇలా స్వదేశాలను వదిలి పారిపోయి రావడానికి గల బలమైన కారణాలేవి .దీని గురించి కొత్తకోణంలో మరింత చర్చ జరగాలి.ఎందుకంటే మానవ చరిత్ర వలసలతోనే మొదలైందని ఆయన గుర్తుచేస్తున్నారు .ఒకప్పుడు వలసల పట్ల ఎలాంటి ఆంక్షలూ వుండేవి కావు.అదే మనం చరిత్రను చూసే దృష్టి కోణాన్ని నిర్ణయించింది అంటారాయన

నిఘాత్ దాడ్: పాకిస్థానీ స్త్రీలు అంతర్జాలాన్ని ఎలా వాడుకుంటున్నారు

TEDGlobal 2017

నిఘాత్ దాడ్: పాకిస్థానీ స్త్రీలు అంతర్జాలాన్ని ఎలా వాడుకుంటున్నారు
1,184,008 views

సభ్యురాలు నిఘాత్ దాడ్ ఆన్ లైన్ నేదింపులపై అధ్యయనం చేసారు.అదీ ఆ ఆమె స్వగ్రామమైన ఓ చిన్న గ్రామంలో వున్నట్టి పితృస్వామ్య వ్యవస్థకు చెందింది .ఆమె పాకిస్తాన్ లో సైబర్ వేధింపుల పై తొలిసారిగా హెల్ప్ లైన్ ఎలా మొదలుపెట్టారో వివరించారు.ఆన్ లైన్ లో స్త్రీలు ఎదుర్కొనే తీవ్రమైన బెదరింపులకు సమాధానంగా దీన్ని స్థాపించారు."సురక్షిత అంతర్జాలం అంటే జ్ఞానం అందుబాటులోకి వచ్చినట్లు.జ్ఞానమే స్వేచ్ఛ" అంటారామె. "స్త్రీల డిజిటల్ హక్కులకోసం పోరాటం అంటే సమానత్వం కోసం పోరాటం అని అర్థం."

వ్యాలోయ్ యెఇజిద్: ఆఫ్రికా యొక్క బలాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని ఆచరిస్తున్న ఫ్యాషన్

TEDGlobal 2017

వ్యాలోయ్ యెఇజిద్: ఆఫ్రికా యొక్క బలాన్ని మరియు ఆత్మ గౌరవాన్ని ఆచరిస్తున్న ఫ్యాషన్
899,451 views

"ఒక ఆఫ్రికన్ లా ఉండటం అంటే సంస్కృతి మరియు భవిష్యతు గురించిన అంతు లేని నమ్మకంతో నిండి ఉన్న ప్రేరణ," అని డిజైనర్ మరియు టెడ్ తోటి వారైన వ్యాలోయ్ ఇజిద్ ఇలా చెప్పారు. తన ముద్ర అయిన ఇర్కే జోన్స్ ("బ్లాకు ప్యాన్తర్" చిత్రంలో వారి పనిని మీరు చూస్తారు), తను ఒక ప్రతిష్టాత్మక నమూనా ద్వారా తరచూ అట్టడుగున ఉండే సమూహాల గోప్పతన్నాన్ని కథలుగా ఓక చక్కటి వస్త్రంపైన మలిచి మనకు చూపించ బోతున్నారు.

టిటో దేలెర్: "నా అత్యుత్తమ బహుమతి"

TED@Tommy

టిటో దేలెర్: "నా అత్యుత్తమ బహుమతి"
220,095 views

బ్లూస్ సంగీతకారుడు టిటో డెలెర్ న్యూయార్క్, పెరుగుతున్నపుడి నాటి శబ్దాలను, పూర్వపు యుద్ధ మిస్సిస్సిప్పి డెల్టా బ్లూస్తో విలీనం చేసి, వేదికనలంకరించి, తన గిటార్ సంగీతంతో పరవశిస్తూ "నా అత్యుత్తమ బహుమతి" అనే పాటను పాడారు.

నిక్కి వెబర్ అలెన్: మీ వ్యాకులతను నిశ్సబ్దంగా భరించకండి

TED Residency

నిక్కి వెబర్ అలెన్: మీ వ్యాకులతను నిశ్సబ్దంగా భరించకండి
2,292,266 views

స్పందనలుండడం బలహీనత కాదు.దానర్థం మనం మనుష్యులమని అంటారు నిర్మాత నిక్కి వెబర్ అలెన్ .వ్యాకులత , ఆంగ్జైటిలు ఉన్నాయని నిర్ధారించబడిన తరువాత వెబర్ తన పరిస్థితిని చెప్పుకోడానికి సిగ్గు పడ్డారు..దాన్ని రహస్యంగా నే వుంచారు , కుటుంబంలో ఓ విషాదం జరిగేవరకూ.ఆమె ఆత్మీయులొకరు ఇలాగే బాథ పడుతున్నారని తెలిసేవరకూ.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఉపన్యాసంలో బహిరంగంగా తన సమస్యను పంచుకున్నారు.అంతేకాదు కొన్ని జాతులవారు సిగ్గుపడి డిప్రెషన్ ను బలహీనతగా పొరపాటుగా భావించి,సహాయం పొందడానికి బదులు నిశ్శబ్దంగా భరిస్తున్నారని అన్నారు.

అనింద్యా కుండు: విద్యార్థులు మరింత అభివృధ్దిని సాధించడానికి గల మార్గాలు

TED Residency

అనింద్యా కుండు: విద్యార్థులు మరింత అభివృధ్దిని సాధించడానికి గల మార్గాలు
1,902,460 views

స్కూళ్లో చదువులో వెనుకబడ్డ విద్యార్థులు ప్రగతిని ఎలా సాధిస్తారు?సోషియాలజిస్ట్ అనింద్యా కుండు ధైర్యం , పట్టుదల మాత్రం సరిపోవు.వాళ్ళు వాళ్ల సామర్థ్యాన్ని పెంపు జేసుకోవాలి లేదా ఆటంకాలని ఎదిరించే గుణం తో వ్యవస్థను ఎదిరించాలి.అతను ఇలా వ్యక్తిగత, సాంఘిక,సంస్థాగత సవాళ్ళను ఎదిరించి అంచనాలను మించి అభివృధ్ధి చెందిన ఇద్దరు విద్యార్థుల ఆశావహ కథనాలను మనతో పంచుకున్నారు.

రాబిన్ హన్సన్: మన మెదడుని కంప్యూటర్స్ కి అనుసంధానిస్తే ఏమి అవుతుంది?

TED2017

రాబిన్ హన్సన్: మన మెదడుని కంప్యూటర్స్ కి అనుసంధానిస్తే ఏమి అవుతుంది?
1,430,160 views

"EMS" ని కలవండి -- మనిషి మెదడుని నకలు చేయగలిగి, అలాగే ఆలోచించగలిగి, అనుభూతి చెంది మరియు పనిచేయగలిగే యంత్రం. భవిష్యత్తు వేత్త మరియు సాంఘిక శాస్త్రవేత్త ఐన రాబిన్ హన్సన్ , EMS మన ఆర్ధిక వ్యవస్థ ని స్వాధీనం చేసుకుని, చాలా వేగవంతమైన కంప్యూటర్స్ మీద పని చేసి, ఒకే సారి వివిధమైన పనులు చేసే యంత్రాల గురించి వివరిస్తున్నారు. దాని తరువాత, మనుషులకి ఒకటే ఎంపిక మిగులుతుంది, అది విశ్రాంత జీవితం, ఎప్పటికి.. మర మనుషులు భూ లోకాన్ని పాలిస్తే వచ్చే వింత భవిష్యత్తుని హన్సన్ గారు వివరిస్తున్నారు.

డామన్ డేవిస్: ఫెర్గూసన్ వ్యతిరేక ప్రదర్శనలో నేనేం చూసాను

TED2017

డామన్ డేవిస్: ఫెర్గూసన్ వ్యతిరేక ప్రదర్శనలో నేనేం చూసాను
1,189,894 views

2014 లో డామన్ డెవిస్ మిస్సోరి లోని ఫెర్గూసన్ లో పోలీస్ కాల్పులలో మైకెల్ బ్రౌన్ మరణాన్ని చూసాడు.ఆ సంఘటనలో అతడు జనాల్లో కోపాన్ని మాత్రమేగాక వ్యక్తిగతంగా,సంఘపరంగా అభిమానాన్ని చూసాడు.అతని డాక్యుమెంటరీ "Whose Streets?" ఆందోళన కారుల దృక్కోణాన్ని చూపుతుంది.భయాన్ని, ద్వేషాన్నీ వ్యాప్తి చేసేవారిని ఎదిరించే గుండెధైర్యాన్ని వివరిస్తుంది.

గ్రేస్ కిమ్: మనన్ని కోహౌసింగ్ ఆనందం గా ఇంకా ఎక్కవ కాలం జీవించేటట్టు ఏలా చేస్తుంది?

TED2017

గ్రేస్ కిమ్: మనన్ని కోహౌసింగ్ ఆనందం గా ఇంకా ఎక్కవ కాలం జీవించేటట్టు ఏలా చేస్తుంది?
2,237,287 views

ఒంటరితనం ఒంటరిగా ఉండడం వల్ల రాదు. అది మనకు వేరే వాళ్ళతో ఎంతవరకూ సంబంధాలు ఉన్నాయి అనేదాని మీద ఉంటుంది.ఆమె చాలా పాతదైన కో హౌసింగ్ అనే పద్ధతి ద్వారా పొరుగు వాళ్ళతో స్తలం పంచుకొని, వాళ్ళను అర్థం చేసుకుంటూ వాళ్ళను చూసుకుంటూ ఆనందం గా ఉండవచ్చని చెపుతారు.

జెనిఫర్ ప్లజ్ నిక్: మీ శరీరం తోనూ వాసనలను గ్రహిస్తారు,కేవలం ముక్కుతో మాత్రమే కాదు

TEDMED 2016

జెనిఫర్ ప్లజ్ నిక్: మీ శరీరం తోనూ వాసనలను గ్రహిస్తారు,కేవలం ముక్కుతో మాత్రమే కాదు
1,702,806 views

మీ కిడ్నీలు వాసనలను గుర్తించగలవా ? అతి సూక్ష్మమైన వాసనను గ్రహించే డిటెక్టర్లు మీ ముక్కులోనే కాకుండా ఇతర అవయవాల్లోనూ ఉన్నాయి.ఉదా కండరాలు,మూత్రపిండాలు చివరికి ఊపిరితిత్తుల్లో కూడా.ఈ చిన్ని ఉపన్యాసంలో వాస్తవాలతో ఫిజియాలజిస్ట్ జెనిఫర్ ప్లజనిక్ వివరిస్తున్నారు.అవి అక్కడెందుకున్నాయి,ఏం చేస్తున్నాయి అని.

సుసాన్ రోబిన్ సన్: నేనెందుకు వికలాంగురాలిగా ఉండలేకపోయాను

TED Residency

సుసాన్ రోబిన్ సన్: నేనెందుకు వికలాంగురాలిగా ఉండలేకపోయాను
1,458,794 views

జన్యుసంబంధ కంటిజబ్బుతో పుట్టారు.దానికి నివారణ,చికిత్స రెండూ లేవు.నిజానికి ఆమె అంథురాలు. కానీ అలా అంటే ఆమె ఒప్పుకోరు.తనను తాను పాక్షిక అంథురాలిగా అభివర్ణించుకుంటారు.వికలాంగురాలు అనే గుర్తింపును అసహ్యించుకుంటారు .సరదాగా , వ్యక్తిగతంగా సాగిన ఈ ప్రసంగంలో అశక్తత పట్ల మనలో వున్న ఆనుమానాలను వివరిస్తూ,దాన్ని జయించడానికి 5 చిట్కాలను సూచించారు

మెహది ఆర్డి ఖాని  సెడ్లర్: ఒకదానిపై శ్రద్ధ పెట్టినప్పుడుమీ మెదడులో ఏం జరుగుతుంది

TED2017

మెహది ఆర్డి ఖాని సెడ్లర్: ఒకదానిపై శ్రద్ధ పెట్టినప్పుడుమీ మెదడులో ఏం జరుగుతుంది
3,083,456 views

శ్రధ్ధ అంటే కేవలం మనం చూసే చూపు మాత్రమే కాదు-మన మెదడు దేనికి ప్రాధాన్యమిస్తుంది అనికూడా.జనం ధ్యాస పెట్టడంవల్ల మెదడులో జరిగే మార్పుల పై పరిశోధన చేస్తున్న కంప్యుటేషనల్ న్యూరో సైంటిస్ట్ మెహది ఆర్డిఖాని సెడ్లర్ మన మెదడును కంప్యూటర్ మరింత దగ్గరగా తేవాలని ఆశిస్తున్నారు.మాట్లాడలేని వారిని ట్రీట్ చేసే విధానాల గురించి నమూనాలను తయారుచేయాలని ఆశిస్తున్నారు.ఈ క్లుప్తమైన ,ఉత్తేజ భరితమైన ఉపన్యాసం విని మరిన్ని విశేషాలను తెలుసుకోండి

ట్రియోనా మెక్ గ్రాత్: సముద్రజలాలపై కాలుష్య ప్రభావం

TEDxFulbrightDublin

ట్రియోనా మెక్ గ్రాత్: సముద్రజలాలపై కాలుష్య ప్రభావం
1,510,462 views

వాతావరణంలోకి మనం పంపే కార్బన్ డై ఆక్సైడ్ సముద్రజలాల్లో కలిసిపోతున్నది.దానితో సముద్ర జలాల స్వభావం తీవ్రమైన మార్పులకు గరౌతున్నది.ట్రియోనా మెక్ గ్రాత్ ఈ ప్రక్రియను గూర్చి పరిశోధిస్తున్నారు.సముద్రాల ఆమ్లీకరణ అనే పేరుతో.ఈ ఉపన్యాసంలో ఆమె మనల్ని సముద్ర ప్రపంచానికి తీసికెళ్తున్నారు.సముద్ర జలాల సంతులనంలో మార్పులు- జీవజాతులపై దాని ప్రభావం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.

లారా వాండెర్కమ్: మీ చేతుల్లో మీ సమయం ఎలా సద్వినియోగించుకోవాలి

TEDWomen 2016

లారా వాండెర్కమ్: మీ చేతుల్లో మీ సమయం ఎలా సద్వినియోగించుకోవాలి
9,660,409 views

ప్రతి వారానికీ 168 గంటలుంటాయి.మనకు ముఖ్యమైన వాటికి సమయాన్నెలా పొందాలి?టైం మానేజ్ మెంట్ ప్రవీణురాలు లారా వాండెర్కమ్ బిజీగా వుండే వ్యక్తుల జీవన సరళిపై అధ్యయనం చేసారు. దానిలో తేలిందేంటంటే మనలో చాలా మంది ప్రతివారం మనం చేసే పనులను గూర్చి ఎక్కువ అంచనాలను,చేతిలో వున్న సమయాన్ని గూర్చి తక్కువ అంచనాలనూ వేసుకుంటాము.కొన్ని ప్రాక్టికల్ వ్యూహాలను మనకు కావాల్సిన వాటి కోసం కేటాయించడానికి అందిస్తున్నారు.ఈ రకంగా మనజీవితాల్ని మనకున్న సమయంతో తీర్చిదిద్దుకోవచ్చు

ఆడం గాలింస్కీ: మీ కోసం మీరు మాట్లాడడం ఎలా

TEDxNewYork

ఆడం గాలింస్కీ: మీ కోసం మీరు మాట్లాడడం ఎలా
6,470,165 views

ఒక విషయం గురించి మాట్లాడడం కష్టం, మనం మాట్లాడితీరాలని తెలిసినప్పుడు కూడాకూడా.సాంఘిక మనస్తత్వవేత్త ఆడం గాలింస్కీ మార్గ నిర్దేశం లో మీ గురించి మీరు చాటుకోవడం నేర్చుకోన్డి,క్లిష్టమైన సామాజిక పరిస్థితుల్లో మార్గనిర్దేశం చేయడం ఇంకా మీ స్వీయ శక్తి యొక్క హద్దులను విస్తరించుకోవడం నేర్చుకోన్డి.

మర్యానో సిగ్ మన్: మీరు వాడే పదాలే మీ భవిష్యత్  మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి

TED2016

మర్యానో సిగ్ మన్: మీరు వాడే పదాలే మీ భవిష్యత్ మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి
3,146,887 views

మీరు ఇప్పుడు మాట్లాడే విధానం ఆధారంగా సైకోసిస్ దృష్ట్యా భవిష్యత్ లో మీ మానసికస్థితిని అంచనా వేయగలమా?మంత్రముగ్థులను చేసే ఈ ఉపన్యాసంలో ప్రముఖ న్యూరోసైంటిస్ట్ మరియానో సిగ్మన్ ప్రాచీన గ్రీకుల అంతశ్శోధన మూలాలను ఆధారంగా చేసుకుని మనం వాడే పదాలు మన అంతరాంతరాల ఆలోచనా విధానాన్ని ఎలా బయటపెడ్తాయో చెపుతూ, ఆ పదాల ఎంపిక ద్వారా స్కిజోఫెర్నియా లక్షణాలను గుర్తించే విధానం వివరిస్తూ, ముందు కాలంలో మానసికారోగ్యాన్ని విభిన్న కోణాల్లో చూస్తామని అంటారు.ఇది మనం వాడే పదాల అటోమాటిక్ అనాలిసిస్ ,అంతేకాక లక్ష్యాత్మకమైనది,స్వయంతచాలకమైనది కూడా అని ఈ ఉపన్యాసంలో వివరించారు.

జాషువా ప్రేజర్: జీవితంలోని దశలగూర్చి మహాకవుల ఆలోచనలు

TEDActive 2015

జాషువా ప్రేజర్: జీవితంలోని దశలగూర్చి మహాకవుల ఆలోచనలు
1,797,150 views

మానవులుగా మనందరం విభిన్నం.అందరమూ జీవితంలోని దశలను ఒకే పద్ధతిలో దాటుతాము.మనం ఇష్టపడే పుస్తకాల్లోని పేజీల్లా ఇవి కదిలిపోతూవుంటాయి.మనస్సును కదిలించే ఈ ఉపన్యాసంలో జర్నలిస్ట్ జాషువా ప్రేజర్ జీవితంలోని విభిన్నదశలను నార్మన్ మెయిలర్ , జాయిసీ కెరోల్ ఓట్స్ విలియం ట్రెవోర్ మొదలగు రచయితల సూక్తుల సహాయంతో వివరించారు. మిల్టన్ గ్లేసర్ అనే గ్రాఫిక్ డిజైనర్ సాయంతో దృశ్యమాలికలుగా ఆవిష్కరించారు.పుస్తకాలు మన వ్యక్తిత్వాల భూత,వర్తమాన,భవిష్యత్తులను చెప్తాయి అంటారు ఈ ఉపన్యాసంలో.

నట్ హానియస్: కంపెనీలు ఫెయిల్ అవడానికి గల రెండు కారణాలు_ వాటి నెలా నివారించగలం

TED@BCG London

నట్ హానియస్: కంపెనీలు ఫెయిల్ అవడానికి గల రెండు కారణాలు_ వాటి నెలా నివారించగలం
2,083,658 views

ఒక కంపెనీని నడుపుతూ ,క్రొత్త మార్పులను చేపట్టడం సాధ్యమేనా?వ్యాపార వ్యూహకర్త నట్ హానియస్ దృష్టిలో ఉన్నత స్థాయిని చేరాక కూడా నూతన మార్గాలను చేరుకునే సామర్థ్యమే సంస్థ ఘనతకు గుర్తు.వారు మనకు తెలిసిన దాంట్లో పర్ఫెక్షన్ ను సాధించడం, నూతన ఆవిష్కరణలను కనుగొనడం ఈ రెంటిలో సమతుల్యతనెలా సాధించాలో తన దైన శైలిలో వివరిస్తున్నారు . అది సమయంలో ఈ రెంటిలో ఒక దానిపై మొగ్గు చూపకుండా ఎలా నడుచుకోవాలో వివరిస్తున్నారు

రేష్మా సౌజాని: బాలికలకు ధైర్యాన్ని నేర్పండి,పరిపూర్ణత్వాన్ని కాదు

TED2016

రేష్మా సౌజాని: బాలికలకు ధైర్యాన్ని నేర్పండి,పరిపూర్ణత్వాన్ని కాదు
4,984,427 views

మనం మన బాలికలను పర్ ఫెక్ట్ గా ,బాలురను ధైర్యవంతులుగా అయ్యేలా పెంచుతున్నాం అంటారు రేష్మా సౌజాని.వీరు 'Girls Who Code' సంస్థను స్థాపించారు. బాలికలకు రిస్క్ తీసుకోవడం , ప్రోగ్రాం చేయడం అనే రెండు నైపుణ్యాలను నేర్పడానికై కంకణం కట్టుకున్నారు.ఈ రెండు నైపుణ్యాలు సంఘం ముందడుగు వెయ్యడంలో ఉపకరిస్తాయి .ఇది నిజంగా సరికొత్తభావన .మన జనాభాలో సగం మందిని వదిలి మనం ముందుకు పోలేము అన్నది వీరి నినాదం. మీలో ప్రతిఒక్కరూ నాకు కావాలి. ప్రతి మహిళా తన లోని లోపాలను అంగీకరిస్తూ, సౌఖ్యంగా జీవిచంగలగాలి అన్నది ప్రచారం చేయడం కోసం.

సెలెస్టీ  హెడ్ లీ: మంచి సంభాషణకు పది సూత్రాలు

TEDxCreativeCoast

సెలెస్టీ హెడ్ లీ: మంచి సంభాషణకు పది సూత్రాలు
17,081,256 views

సంభాషణా చాతుర్యమే మీ ఉద్యోగానికి కేంద్ర బిందువైతే,మంచి సంభాషణ లెలా వుండాలో తెలుసుకుంటారు.మనలో చాలామందికి సంభాషణా చాతుర్యం లేదు.దశాబ్దాల తరబడి రేడియో హోస్ట్ గా పనిచేసారు సెలెస్టీ హెడ్ లీ.మంచి సంభాషణకు కావలసిన దినుసులు ఆమెకు తెలుసు.నిజాయితీ,ధైర్యం , స్పష్టత , వినేగుణం ఇవే. ఆలోచింపజేసే ఈ ఉపన్యాసం లో ఆమె సంభాషణకళను పెంపొందించుకునే పది సూత్రాలను మనతో పంచుకున్నారు.బయటికెళ్ళండి."ప్రజల్తో మాట్లాడండి.వినండి."చివరికి ఇలా అన్నారు."చాలా ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి" అని.